సామాన్యులకి సూపర్ గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది..

LPG Gas Cylinder Price Cut: దేశవ్యాప్తంగా ప్రతి మొదటి రోజు గ్యాస్ సిలిండర్ ధరలను మార్పులు చేస్తారు. అయితే ఈసారి కాస్త ఒకరోజు ముందుగానే ఈ ధవరలను ధరలను సవరించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీంతో 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధరను రూ.24 తగ్గిస్తున్నట్లు తాజాగా ఆయిల్‌ గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. జూన్ 1వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.24 తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ కొత్త సవరించిన ధరలు జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ రేటు రూ.1723 చేరింది. ఇది స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉంటుంది.

తగ్గించిన ఈ గ్యాస్ సిలిండర్ ధరలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ ధరల్లో మార్పులు కూడా చేస్తారు. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తారు. కానీ ఈసారి ఒకరోజు ముందుగానే ధరలను సవరించారు.

అయితే వరుసగా మూడోసారి కూడా గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. మే నెలలో రూ.14.50 తగ్గించాయి. ఏప్రిల్ లో రూ.41 తగ్గించారు. వరుసగా మూడోసారి గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి.

అయితే రెగ్యులర్ గా ఉపయోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ సిలిండర్ ధర 14 కిలోలు రూ. 853 ఢిల్లీలో ఉంది. అయితే అంతర్జాతీయ ఇంధన సగటు ధర, దేశీయ మారక రేటు ఆధారంగా ఏటిఎఫ్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలను ఈ ఆయిల్‌ కంపెనీలు సవరిస్తాయి.

తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రెస్టారెంట్, హోటల్ ఇండస్ట్రీ వాళ్లకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. వీళ్ళకి భారీ ప్రయోజనం కలుగుతుంది, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. దీంతోపాటు చిన్న వ్యాపారాలు చేసే టిఫిన్, క్యాటరింగ్ వ్యాపారులకు కూడా శుభవార్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *