సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో మన తెలుగోడే..

సినిమాలతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్‌గా ఎదిగాడు ఒక తెలుగు హీరో. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.3.572 కోట్లు. ఆ హీరో ఎవరో కాదు, టాలీవుడ్ కింగ్ నాగార్జున.

ఇండియాలో రిచెస్ట్ సినిమా సెలబ్రిటీలు ఎవరంటే అందరూ బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పేర్లు చెబుతుంటారు. అక్కడి వారి సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్లను రాబడుతుంటాయి. అయితే, గత కొన్నేళ్లుగా సీన్ రివర్స్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు హిందీ బెల్ట్‌లో అదరగొడుతుండటంతో ఇక్కడి హీరోలకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అటు, రెమ్యునరేషన్ విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే సినిమాలతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్‌గా ఎదిగాడు ఒక తెలుగు హీరో. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.3.572 కోట్లు. ఆ హీరో ఎవరో కాదు, టాలీవుడ్ కింగ్ నాగార్జున.

శివ సినిమాతో తెలుగు చిత్రసీమపై ఓ సంచలనం సృష్టించి మన్మథుడిగా యువత మనసు దోచుకున్న హీరో, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించి అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. యంగ్ సామ్రాట్‌గా తెలుగు వారి అభిమానాన్ని పొందుతున్నాడు. ఇప్పటికీ ఓ వైపు సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షోలతో బిజీబిజీగా గడుపుతున్నాడంటే ఆయన చరిష్మా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమాలే కాకుండా బిజినెస్‌లో కూడా నాగార్జున సక్సెస్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఏకంగా రూ.3,500 కోట్లకు అధిపతిగా నిలిచి దక్షిణాదిలో రిచెస్ట్ యాక్టర్ (Richest Actor)గా నిలిచాడు.

వీళ్లు నాగార్జున కన్నా కిందే.. మనీకంట్రోల్ (Moneycontrol) వెబ్‌సైట్ ప్రకారం.. నాగార్జన నికర సంపద 410 మిలియన్ డాలర్లు. అంటే, రూ.3,572 కోట్లు. బాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా చెలామణి అవుతున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan- రూ.3,200 కోట్లు), హృతిక్ రోషన్ (Hritik Roshan- రూ.3,100 కోట్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan- రూ.2,900 కోట్లు), అక్షయ్ కుమార్ (Akshay Kumar- రూ.2,700 కోట్లు), ఆమిర్ ఖాన్ (Aamir Khan- రూ.1,900 కోట్లు)ను సైతం అధిగమించి టాప్‌లో నిలిచాడు. దక్షిణాదిలో చిరంజీవి (Chiranjeevi- రూ.1,650 కోట్లు), రామ్‌చరణ్ (Ram Charan-రూ.1370), రజనీకాంత్ (Rajinikanth- రూ.500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR- రూ.500 కోట్లు), ప్రభాస్ (Prabhas- రూ.250 కోట్లు) సైతం నాగార్జున వెనకే ఉన్నారు.

ఇంత సంపాదన ఎలా? నాగార్జున ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించాడు. సినిమాల నుంచి రెమ్యునరేషన్‌తో పాటు వివిధ బిజినెస్ వెంచర్ల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రముఖ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) ఓనర్ నాగార్జునే. రియల్ ఎస్టేట్, స్ట్పోర్ట్స్ ఫ్రాంఛైజీలలోనూ పెట్టుబడులు పెట్టాడు. N3 Realty Enterprises అనే రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థ ఆయనదే. కేవలం రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువే రూ.900 కోట్లుగా ఉంటుందని దైనిక్ భాస్కర్ రిపోర్ట్ చెబుతోంది. నాగార్జునకు 3 స్పోర్ట్స్ ఫ్రాంఛైజీలు, ఓ ప్రైవేట్ జెట్, అర డజనుకుపైగా లగ్జరీ కార్లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *